కాలేజీ రోజుల్లో రెచ్చిపోయి బొమ్మలు గీసేశాను.నేను మాగ్జిమం బొమ్మలు గీసింది ఈ రోజుల్లోనే
వనరమ...
నేను గీసిన అన్ని బొమ్మల్లోకీ నాకు అత్యంత ఇష్టమైన బొమ్మ.1996 లో గీశాను. (వపా గారి చందమామ అట్ట చూసి) ఇప్పటికీ మా ఇంట్లో ఎదురుగా ఉంటుంది. ఈ బొమ్మ కేసిచూస్తూ కూర్చుంటే ఎన్ని గంటలు గడిచిపోతాయో తెలీదు.
---00000----
తపోభంగం...
వపాగారి ఇంకొక బొమ్మని చూసి గీసినది
తియ్య విల్కాడు వింట సంధించి విడిచె, అక్షయమ్మైన సమ్మోహనాశుగమ్ము
గౌరి కడగంటి చూపుతో కలిసిపోయి, గ్రుచ్చుకొనెనది ముక్కంటి గుండెలోన

---00000----
నా కధల్లోనూ, నవల్లలోనూ మొనాలిసాని అప్పుడప్పుడూ గుర్తుచేసుకుంటూ ఉంటాను.అందువల్ల మొనాలిసా బొమ్మ గీశాను. (ఇప్పుడూ చూస్తుంటే ఇంకా చాలా బాగా గీసుండచ్చు అనిపిస్తుంది...కానీ ఎందుకో ఈ బొమ్మ మళ్ళీ గీయబుధ్ధి కావట్లేదు)

---00000----
అద్భుతంగా ఉన్నాయండీ!
ReplyDelete