Monday, August 6, 2012

సహజీవనం

సహజీవనం







కొన్నేళ్ళ క్రితం నేను కంపెనీ మారినప్పుడు, నాకొక శాడిస్టు బాసు తగిలాడు.

ఎంత శాడిస్టంటే, ఈ కధలో చెప్పిన దానికన్నా ఒక పదింతలు ఎక్కువ...



కంపెనీ నుంచి పారిపోదామనుకున్నా గానీ, అప్పుడే చేరటం వల్ల, వెంటనే మారటం ఎందుకులే అని ఆగిపోయాను...

కొన్నాళ్ళు పోయకా అనిపించింది – “సమస్య నుంచి దూరంగా పారిపోయినా అసలు సమస్యనేదే లేనిది ఎక్కడలే?”, అని.

మెల్లిగా అక్కడే ఉండి పోరాడటం మొదలు పెట్టా…చక్కదిద్దుదామని కూడా ప్రయత్నించేలోపే, విసిగిపోయిన మా

స్నేహితులంతా కల్సి మూకుమ్మడిగా HR కి కంప్లైంట్ ఇవ్వడంతో (ఋజువులని రికార్డు చేసి మరీ) మా హిత్లర్ బాసు చరిత్ర ముగిసిపోయింది.



ఆ సందర్భంలో పుట్టినదే ఈ కధ…



ఆగస్టు 2012 లో వచ్చిన స్వాతి మాసపత్రికలో ప్రచురింపబడింది. ఈ కధని ఇక్కణ్ణుంచి డౌన్‌లోడ్ చేసుకోండి:

http://www.scribd.com/doc/101918869

Sunday, August 5, 2012

కన్నడలో నా కధ

కన్నడలో నా కధ




శకడు నూరష్టు స్వతంత్రత

----------------------



బెంగుళూరులో ఉంటున్నందుకు, మొత్తానికి నా కధ ఒకటి కన్నడలోకి అనువాదమయ్యింది :)





గతంలో నాకు అనీల్ అవార్డ్ తెచ్చిపెట్టిన “100% ఇండిపెండెంట్” అనే కధని, శ్రీ బండ్రీకరణం సత్యనారాయణ గారు “శకడు నూరష్టు స్వతంత్రత” అనే పేరుతో కన్నడలోకి అనువదించారు (ఆయన గతంలో విశ్వనాధగారి వేయి పడగల్ని కూడా అనువదించారట)

“ప్రియాంక” అనే కన్నడ పత్రిక నిర్వహించిన కధల పోటీలో ఈ కధకి బహుమతి వచ్చింది.



ఆ కన్నడ కధ ఇక్కణ్ణుంచి డౌన్ లోడ్ చేసుకోండి.

http://www.scribd.com/doc/97434264/SekaDa-nUrarasTu-Swatamtra