Tuesday, October 13, 2009

చిన్నప్పటి బొమ్మలు (upto 1992)

మొన్నీ మధ్య ఇంటికెళ్ళినప్పుడు, చిన్నప్పుడు వేసిన బొమ్మలు కొన్ని దొరికాయి.వీలున్నప్పుడు స్కాన్ చేసి పెడతాను.

దత్తోదాహరణం - 2006

శ్రీ ఆదిభట్ల నారాయణదాసు గారి(హరికధా పితామహుడు) మనవుడు శ్రీ కామేశ్వరశర్మ గారు, 2006 లో ఓ ఉదాహరణ కావ్యం రాశారు (మైసూర్ దత్త పీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామిని గూర్చి) ఆ పుస్తకంలో విభక్తులకి నేను వేసిన వాటర్ కలర్ బొమ్మలు...





















Monday, October 12, 2009

ఆయిల్ పెయింటింగ్స్
















ఇన్స్పైర్ అయ్యి గీసిన బొమ్మలు (1995-1998)




కాలేజీ రోజుల్లో రెచ్చిపోయి బొమ్మలు గీసేశాను.నేను మాగ్జిమం బొమ్మలు గీసింది ఈ రోజుల్లోనే

వనరమ...


నేను గీసిన అన్ని బొమ్మల్లోకీ నాకు అత్యంత ఇష్టమైన బొమ్మ.1996 లో గీశాను. (వపా గారి చందమామ అట్ట చూసి) ఇప్పటికీ మా ఇంట్లో ఎదురుగా ఉంటుంది.  ఈ బొమ్మ కేసిచూస్తూ కూర్చుంటే ఎన్ని గంటలు గడిచిపోతాయో తెలీదు.





---00000----


తపోభంగం...


వపాగారి ఇంకొక బొమ్మని చూసి గీసినది


తియ్య విల్కాడు వింట సంధించి విడిచె, అక్షయమ్మైన సమ్మోహనాశుగమ్ము


గౌరి కడగంటి చూపుతో కలిసిపోయి, గ్రుచ్చుకొనెనది ముక్కంటి గుండెలోన


---00000----


నా కధల్లోనూ, నవల్లలోనూ మొనాలిసాని అప్పుడప్పుడూ గుర్తుచేసుకుంటూ ఉంటాను.అందువల్ల మొనాలిసా బొమ్మ గీశాను. (ఇప్పుడూ చూస్తుంటే ఇంకా చాలా బాగా గీసుండచ్చు అనిపిస్తుంది...కానీ ఎందుకో ఈ బొమ్మ మళ్ళీ గీయబుధ్ధి కావట్లేదు)

---00000----








---00000----

కోటి రూపాల కృష్ణుడు, కొంగుచాటున ఉన్నాడు - కొంటె చూపుల చినవాడు, కోమలి ఎదలో ఉన్నాడు














కొంచెం బెటరు బొమ్మలు (1992-1995)

చిన్నప్పట్నుంచీ బొమ్మలేయడమంటే పిచ్చి నాకు...ఖాళీ ఉన్నప్పుడల్లా హనుమంతుడు, వినాయకుడు బొమ్మలు గీసేవాణ్ణి (వీళ్ళకైతే ముక్కూ మూతీ వెయ్యఖ్ఖర్లేదు కదాని)
బాపూ గారన్నా, వడ్డాది పాపయ్యగారన్నా చచ్చేంత అభిమానం...వీలున్నప్పుడల్లా వాళ్ళ బొమ్మలు వేస్తూ ఉండేవాడిని!
అలా వేసీ వేసీ చివరకి కలరింగ్ కొంచెం అబ్బింది.నేను వేసిన కొన్ని వాటర్ కలర్ పెయింటింగ్స్ ఇక్కడ ఉంచుతున్నాను.

---00000----
నాకుపెయింటింగ్ అంతో ఇంతో చేతనయ్యాకా వేసిన మొదటి బొమ్మ








---00000----

మా ఎదురింటి వాళ్ళ ఆల్సేషన్ కుక్కని చూసి గీసిన బొమ్మ!










---00000----






మేనక...ఇది వపా గారి బొమ్మే...కాలేజీలో చదువుకునే రోజుల్లో వేశాను.దురదృష్టవశాత్తూ నేను వేసిన వాటర్ కలర్ పెయింటింగ్ పోయింది.అందువల్ల 2004 లో ఆయిల్ కలర్ లో మళ్ళి వేశాను.







అప్ప్పుడెప్పుడో నేను పోయిందనుకున్న వాటర్ కలర్ పెయింటింగ్ కి తీసిన ఫోటో ఈ మధ్యే దొరికింది.అందుకని దాన్ని స్కాన్ చేసి ఇక్కడ పెడుతున్నాను.

---00000----


---00000----
---00000----
---00000----
---00000----
---00000----

అడుగు జాడలు - 2009

ఈ కధ, అక్టోబర్ 2009 రచన మాసపత్రికలో ప్రచురింపబడింది.
http://www.scribd.com/doc/20938455/aDugu-jADalu

100% ఇండిపెండెంట్ - 2009


ఈ కధ, ఆగస్ట్ 2009 లో వచ్చిన స్వాతి మాసపత్రికలో ప్రచురింపబడింది.

http://www.scribd.com/doc/20938487/100-Independent