Saturday, December 31, 2016

LoveSpot (Horror Detective Novel)

లవ్ స్పాట్ (Love Spot)


(ప్రేమాంబుధిలో తేలియాడించే హారర్ డిటెక్టివ్ నవల)



"మీ నవలలలో ఎప్పుడూ పెళ్ళైపోయిన హీరో హీరోయిన్లే ఉంటారు? ప్రేమికులు ఉండరా?????" 

"మీరు ఏదైనా లవ్‌స్టోరీ రాస్తే చదవాలని ఉంది " 

అంటూ ఆ మధ్య పాఠకులు మెయిల్స్ చేసేవారు.

నాకేమో డిటెక్టివో థ్రిల్లరో రాయకపోతే తోచదు...ఆ రెండు నేపధ్యాలనూ సమ్మిళితం చేస్తూ రాసినదే ఈ లవ్ స్పాట్. స్వాతి నిర్వహించిన అపరాధ పరిశోధనా నవలల పోటీలో లక్ష రూపాయల బహుమతి గెల్చుకుంది. 2014 లో స్వాతి వారపత్రికలో సీరియల్ గా వచ్చింది.



https://www.dropbox.com/s/j77etsva5jwatjw/LoveSpot-Full%20Novel%20-%20Part1.pdf?dl=0
https://www.dropbox.com/s/d08g7bxxctjeui7/LoveSpot-Full%20Novel%20-%20Part2.pdf?dl=0
https://www.dropbox.com/s/zxgxcps0hww3cek/LoveSpot-Full%20Novel%20-%20Part3.pdf?dl=0


ఈ సీరియల్ ప్రచురితమయ్యేందుకు ముందే ప్రఖ్యాత చిత్రకారులు "కరుణాకర్" గారు స్వర్గస్తులయ్యారు. నా గత సీరియల్స్ కి వారు వేసిన బొమ్మలు అద్భుతం. మరి ఈ సీరియల్ కి ఎలాగా అనుకున్నాను కానీ, "టీనా" గారు ఆ లోటు తీర్చారు..."4,8,12,14,15,17 వారాల సీరియల్లో" వారు బొమ్మలు వేసారు. అవి చూసినప్పుడల్లా, "కుంచెలోన హృదయముంచి, హృదయంలో కుంచె ముంచి వేశారేమో" అనిపిస్తుంది. అందులో ఒక బొమ్మని పెద్దగా బ్లోఅప్ చేయించి , నా పుస్తకాల అర పైన అలంకరించుకున్నాను. "టీనా" గారికి నా హృదయ పూర్వక కృతజ్ఞతలు. 


బహుమతుల విషయం పక్కన పెడితే, నేను మనస్సు పెట్టిరాసిన నవల ఇది...ఇదే నా ఆఖరి నవలేమో అన్నంత ఎమోషనల్ గా రాశాను. కొన్ని సీన్లలో తెలియకుండానే కన్నీళ్ళు వచ్చేవి. క్లైమాక్సు రాస్తున్నప్పుడైతే ఉండబట్టలేక ఏడ్చేశాను కూడా...

చివరిగా...

"నీ గుండెల్లో ఆవేదన చెలరేగి, నా వెచ్చని ఊపిరిలో స్వాంతన పొందాలనిపించినప్పుడల్లా, మలయమారుతాన్నై నిన్ను చుట్టు ముట్టనా?...

నాలో వేదనా తరంగం ఎగిసిపడి నీ ముందు వెక్కి వెక్కి ఏడవాలనిపించినప్పుడల్లా, కారుమేఘాన్నై నీ ముంగిట కన్నీటి జల్లు కురిపించనా?...

తెల్లారిగట్టే తోటలోకొచ్చి నా కోసం పరితపిస్తూన్నప్పుడు, విచ్చుకుంటూన్న మరుమల్లికలో నా మేని విరుపుల్ని చూపించనా?...

నా జ్ఞాపకాల్లో నిద్రరాక పక్కమీద నువ్వు దొర్లుతుంటే, లెక్కపెట్టుకోడానికి చుక్కనై నీ కిటికీలోని ఆకాశంలో మిలమిలలాడనా?"

అంటూ స్ఫూర్తినిచ్చిన "పమ్మీ" స్మృతికి ఈ నవల అం...కి...తం!