Sunday, June 17, 2012

ప్రాణం ఖరీదు



ప్రాణం ఖరీదు


ఇంటర్ చదివే రోజుల్లో, "చాణక్య" అని నాకొక ఆప్తమిత్రుడు (వైజాగ్‌లో) ఉండేవాడు. వాడు అద్భుతమైన
క్లాసికల్ డాన్సర్. స్ఫురద్రూపి. "పేరిణీ శివతాండవం" లో వాణ్ణి మించినవాడు లేడేమో అని అనిపించేది...

"విక్టరీ వెంకటేష్" కి వీరాభిమాని వాడు. "అబ్బాయి గారు" సినిమా రిలీజ్ అయినకొత్తల్లో ఒక
చిత్రమైన పందెం కాసి, ఆ గొడవలో ప్రాణాలు కోల్పోయాడు. వాడేకానీ బ్రతికుంటే, విశ్వనాధ్ గారి
సినిమాల్లోకి ఒక మంచి హీరో దొరికుండేవాడేమో...

వాడి మరణవార్త తెల్సినప్పటినుంచీ, మనస్సులో ఏదో కలకలం చెలరేగింది.

కొన్నాళ్ల క్రితం, "బాబా" సినిమా రిలీజైనప్పుడు,సినిమా ఫ్లాప్ అయ్యిందని తెల్సుకున్న ఒక వీరాభిమాని,
సినిమాహాల్లోనే ఎండ్రిన్ తాగి "రజనీ అన్నా, ఈ సినిమా బాగుంది. కానీ నెక్స్ట్ పిక్చెర్ ఇంకా బాగుండాలి"
అని ఒక ఉత్తరం రాసిపెట్టి, హాల్లోనే ప్రాణం వదిలాడు.

మొన్నటికి మొన్న, మగధీర సినిమా మొదటాటకి టిక్కెట్లు దొరకలేదన్న బాధతో, "అప్పటి వరకూ
రిలీజ్ అయిన మెగా ఫ్యామిలీ సినిమాలన్నీ మొదటాటకే చూసినవాణ్ణి, ఇదొక్కటే చూడలేకపోయానే" అనే
ఆవేదనతో, ఆత్మహత్య చేసుకున్నాడు, ఇంకొక అభిమాని.

ప్రియతమ నాయకుణ్ణి ముఖ్యమంత్రిని చేయలేదని చనిపోయినవారు కోకొల్లలు

ఎక్కడికి దారి తీస్తోంది ఈ అభిమానం? ఎంత మంది తల్లితండ్రులకి కడుపుకోత మిగులుస్తోంది?
ఎన్నో ఏళ్ళ నుంచీ ఇలాంటి సంఘటనలని చూశాకా కలిగిన బాధకి అక్షర రూపమే ఈ నవల.

పేరిణీ శివతాండవ చక్రవర్తియై, శివసన్నిధిలో ఆ తాండవం చేయటానికేమో అన్నట్టు త్వరత్వరగా మనల్ని వదిలేసి వెళ్ళిపోయి, శివసాయుజ్యాన్ని పొందిన ప్రియ మిత్రుడు "చాణక్య" స్మృతికి ఈ నవల అంకితం!


జూన్ 2012 స్వాతి మాసపత్రికలో అనుబంధ నవలగా వచ్చింది.
http://www.scribd.com/doc/97328844/Pranam-Khareedu













3 comments: