Thursday, September 19, 2013

Letter box

లెటర్ బాక్స్





ఓ రెండు జంటలు కల్సి, తమ వీధి చివర్నున్న పురాతన దేవాలయంలోని ఒక శిధిల భూగృహన్ని తెరుస్తారు.


ఆ భూగృహన్ని తెరవకూడదనీ, మూడొందల ఏళ్లనుండీ ఒక మహాత్ముడు అందులో సజీవ సమాధి అయ్యున్నాడనీ , అ గుడి పూజారి

ఎంత వారించిన లక్ష్య పెట్టరు...

అప్పటినుంచీ వాళ్ళ జీవితంలో చిత్రమైన సంఘటనలు జరుగుతాయి...మృత్యువు వాళ్ళని నీడలా వెంటాడుతుంది!

ఆ తరవాత ఏం జరిగిందో తెలియాలంటే , ఈ సస్పెన్స్ థ్రిల్లర్ సీరియల్ చదవండి!

ఈ సీరియల్ రాయడం వెనుక ఒక చిన్న కధ ఉంది...

ఒక రోజు, నేనూ నా శ్రీమతీ కధల గురించి వాదించుకుంటూ ఉండగా, "ప్రపంచంలో ఉన్నవి ఏడే కధలట...ఎవ్వరు రాసినా వాటినే తిప్పి తిప్పి రాయాలి..." అన్నాన్నేను.

నా ఖర్మ కాలి నోరు జారానని అ తరువాత తెల్సింది. ఆ వాగ్వివాదం చిలికి చిలికి గాలివాన అయ్యి, " ఛా, అలా అయితే మీ పాత కధల్లోంచి ఒక దాన్ని తీసుకుని, మూల కధ మార్చకుండా, ఆ ఛాయలు పడకుండా రాయండి చూద్దాం" అంటూ ఓ సవాల్ విసిరింది మా ఆవిడ!

నేనేమో పెద్ద గొప్పగా కాలర్ ఎగరేశానుగానీ, "ఎందుకు కమిట్ అయ్యానురా బాబూ?" అని తరువాత చాలా తిట్టుకున్నాను.తనేమో పూటకొకసారి, "రాశారా...? రాశారా?" అని అడుగుతుంటే, వీపు దురదేసి గోడకి రాసుకోవడం తప్ప ఇంకేమీ రాయలేక చచ్చాన్నేను...

చివరకి ఎలాగైతేనేం, ఓ రోజు నా పాత కధనొకదాన్ని తీసుకుని (ఆ కధ పేరు చెప్తే సస్పెన్స్ పోతుందిలెండి) మొదలు పెట్టాను...తీరా మొదలుపెట్టకా, ఛాయలు పడకుండా రాయడం మంచి ఛాలంజింగ్ గానే అనిపించింది...పూర్తయ్యేసరికి మరీ సరదాగ అనిపించింది.

ఈ లోపు స్వాతి పత్రికలో "పదహారు వారాల సీరియల్" పోటీ పడటమూ, ఈ నవలకి బహుమతి రావడమూ జరిగిపోయాయి!

అదే ఈ కధ వెనుక కధ...

స్వాతి వార పత్రికలో జూన్ 2013 నుంచీ ఈ నవల సీరియల్ గా వచ్చింది.

నవలని  ఇక్కడ అప్‌లోడ్ చేశాను...

https://drive.google.com/drive/folders/1J9p0aooSnC1cew6sJtX4v9m4nriZAsNu?usp=sharing


ఈ నవల ప్రచురితమైనప్పుడు, ఉత్తరాల ద్వారా ఫోన్ల ద్వారా ప్రోత్సహించిన అసంఖ్యాక సాహితీ మిత్రులకి నా హృదయ పూర్వక కృతజ్ఞతలు!

4 comments: