గురువుగారు శ్రీ యండమూరి వీరేంద్రనాధ్ గారు, 2009 మే లో, రచన పత్రికలో, ఆహ్లాదకర కధలపోటీ నిర్వహించారు.
సాధారణంగా డిటెక్టివులూ, థ్రిల్లర్లూ రాసే నాకు, " రగతపాతం " లేకుండా ఏ ఆహ్లాదకరమైన ఆలోచన రాలేదు :(
ఈ లోపు మా ఆవిడ ఆపద్బాంధవిలా ఆదుకుంది.
"చిన్నప్పుడు అమ్మమ్మ ఇంట్లో గడిపిన రోజులు మధురాతి మధురం
కదా, వాటిని గుర్తు చేసుకునేలా ఓ కధ ఎందుకు రాయకూడదూ..."
అంటూ సలహా ఇచ్చింది.
ఇకనేం, ఓ కధ మొదలు పెట్టా...కానీ మొదటి మూడు సంఘటనలూ
అయ్యేసరికే, అది పది పేజీలు దాటిపోయింది. చివరకి మినీ నవలగా
రూపు దిద్దుకుంది.
అదే ఈ నవల!
2009 స్వాతి మినీ నవలల పోటీలో ఎంపికయ్యింది.(కానీ 2011
జనవరి నెల స్వాతి మాసపత్రికతో పాటు వచ్చింది)
నాటో పాటు మీకు కూడా, అమ్మమ్మ ఊరికీ, చిన్ననాటి రోజుల్లోకీ
ప్రయాణించడానికి ఇదే ఆహ్వానం...ఈ నవల మిమ్మల్ని చిన్నప్పటి రోజుల్లోకి ఖచ్చితంగా తీసుకెళ్తుంది, కంట తడి పెట్టిస్తుంది...అంతా అయ్యాకా కొన్ని రోజుల పాటు ఒక మధురానుభూతి మిమ్మల్ని వెంటాడుతుంది...ఇప్పటిదాకా చదివిన వాళ్లందరికీ ఇది అనుభవం
ఆ నవలని ఇక్కడనుంచి డౌన్‌లోడ్ చేసుకోగలరు:
https://drive.google.com/file/d/1uronf5U3_ruBiS50mg6NygkBBIi9wR7p/view?usp=sharing
ఈ మధ్య కాలంలో నాకు నచ్చిన రచయితలలో మీరు ఒకరు.
ReplyDeleteమీ "వెన్నెల్లో ఆవకాయ" మనసు లోతుల్ని హృద్యంగా తడిమి ఏవో జ్ఞాపకాలను తట్టి లేపింది. నిజానికి నేను మీ నవలను నా బ్లాగ్ లో పరిచయం చేద్దామనుకున్నా, కానీ దాంతో పాటు ఇవ్వడానికి నాకు ఆన్ లైన్ వెర్షన్ దొరకలేదు.
నిజానికి మీ "వెన్నెల్లో ఆవకాయ" కన్నా ముందే మీ "గర్భాలయం" నవల హంపి చూడాలన్న నా చిరకాల వాంఛ ని తట్టి లేపి హంపి చూసేలా చేసింది. ఆల్ క్రెడిట్స్ టు యు ఓన్లీ.
మీ శైలి బావుంది. ఇలాగే కొనసాగించి మమ్మల్ని మరింత అలరించగలరు.
(వీలయితే నా బ్లాగ్ ని సందర్శించి మీ తిట్లు, చీవాట్లు, ఆశీస్సులు, అక్షింతలు అందించగలరు :) )
శ్రీనివాస్ గారు,
ReplyDeleteమీ నవల చాలా బాగుంది. కొద్దిగా చదివాక నేను ఇలాంటి పల్లెలు ఇంకా ఉన్నాయా అనుకున్నాను. ఊరికే కల్పనగా రాయటం ఎందుకు అనుకున్నాను. కానీ చదవకుండా ఉండలేకపోయాను. అప్పుడనిపించింది - ఉంటేనేం , లేకపోతేనేం చదవటానికి ఇంత బాగుంటే. రాసే విధానం బాగుంది. నేనూ కాసేపు ఆ ఊరికి వెళ్ళినట్టయింది. అభినందనలు. సీరియల్ కూడా మొదలు పెట్టినట్టున్నారు. అభిరుచులు కలసిన మీ దంపతులకు నా శుభాకాంక్షలు.
శ్రీనివాస్ గారు,
ReplyDeleteమీ నవల నిజంగా అద్భుతంగా ఉందండి... నేను నవల చదువుతున్న సమయంలో నాగరాజుగా మారిపోయాను, నవల పూర్తిగా చదివిన తర్వాత, ఆ కథలోని నాగరాజు ఎంత అదృష్టవంతుడు అని ఈర్ష్య కూడా కలిగిందంటే నమ్మండి....
నిజంగా మీ నవల చాలా చాలా చాలా బావుంది... నేను కూడా మా బామ్మ చేతితో తిన్న ఆవకాయ ముద్దలు జ్ఞాపకం వచ్చాయి...
మీ అందరికీ పేరు పేరునా కృతజ్ఞతలండీ
ReplyDeleteHello sir mee navalalu super sir....mee tho oka sari matladalani undi sir plz give ur contact no
ReplyDeleteHi Satya garu,
ReplyDeleteThanks for your comments.
please give me your mail ID, so that I can send my ph number to the same.
namaste sir. I cannot download the novel from scribd. as it is paid. is it possible for me to send the novel in drop box . thanks in advance
ReplyDeleteనీలిమ గారూ,
Deletenanduri.srinivas@yahoo.com కి mail చెయ్యండి.
ఆ PDF మీకు పంపుతాను.
Srinivas garu, na peru Sindhu andi..me novels late ga chaduvutunnanandi, chala chala nachay naku..modata needa chadivanu, aa tarvta indake garbhalayam purti chesanu..renduu chala bagunayandi..ipude meru blog lo pettina link use chesi love spot download cheskuna andi, chadavali adi..needa lo horror ni entha baga rasaro asalu..superb andi🤩🙌🏻🙌🏻 love spot kuda horror anesariki ventane download cheskuna..chadavalandi e katha ipudu..
DeleteAnnattu vennallo aavakay navala ki meru ikada pettina link disable ayyundandi..aa pdf nakuda email cheyagalara, please..
Idi na email andi:
sindhukalidasu9@gmail.com
garbhalayam link ravatledu aa pdf mee daggara untey share chestaara?
DeleteEXCELLENT NOVEL WITH GOOD FEELING. ON THAT DAY I SEND A MAIL TO YOU. IF POSSIBLE PLEASE SEND THE PDF COPY. I WANT READ IT ONE MORE TIME. THANK YOU VERY MUCH FOR GIVING SUCH A GOOD FEEL. I WANT TO ADD ONE MORE WORD HERE, IN THIS NOVEL THE COMPARISON OF ROMANCE BEFORE AND AFTER, WILL GIVE A RESPECT, GREATNESS OF ROMANCE BETWEEN WIFE AND HUSBAND. AT THE SAME TIME IT DISTINGUISH HUMANS FROM ANIMALS. ACCORDING TO ME EVERY YOUNGSTER MUST READ IT ONCE.
ReplyDeleteI am also big fan to you sir
ReplyDeleteఇప్పుడు నండూరి శ్రీనివాస్ గారు ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచన కర్తగా పాపులర్ యూట్యూబ్ చానెల్ నిర్వహిస్తున్నారు.
ReplyDelete