Monday, January 24, 2011

వెన్నెల్లో ఆవకాయ



గురువుగారు శ్రీ యండమూరి వీరేంద్రనాధ్ గారు, 2009 మే లో, రచన పత్రికలో, ఆహ్లాదకర కధలపోటీ నిర్వహించారు.

సాధారణంగా డిటెక్టివులూ, థ్రిల్లర్లూ రాసే నాకు, " రగతపాతం " లేకుండా ఏ ఆహ్లాదకరమైన ఆలోచన రాలేదు :(
ఈ లోపు మా ఆవిడ ఆపద్బాంధవిలా ఆదుకుంది.

"చిన్నప్పుడు అమ్మమ్మ ఇంట్లో గడిపిన రోజులు మధురాతి మధురం
కదా, వాటిని గుర్తు చేసుకునేలా ఓ కధ ఎందుకు రాయకూడదూ..."
అంటూ సలహా ఇచ్చింది.

ఇకనేం, ఓ కధ మొదలు పెట్టా...కానీ మొదటి మూడు సంఘటనలూ
అయ్యేసరికే, అది పది పేజీలు దాటిపోయింది. చివరకి మినీ నవలగా
రూపు దిద్దుకుంది.

అదే ఈ నవల!
2009 స్వాతి మినీ నవలల పోటీలో ఎంపికయ్యింది.(కానీ 2011
జనవరి నెల స్వాతి మాసపత్రికతో పాటు వచ్చింది)

నాటో పాటు మీకు కూడా, అమ్మమ్మ ఊరికీ, చిన్ననాటి రోజుల్లోకీ
ప్రయాణించడానికి ఇదే ఆహ్వానం...ఈ నవల మిమ్మల్ని చిన్నప్పటి రోజుల్లోకి ఖచ్చితంగా తీసుకెళ్తుంది, కంట తడి పెట్టిస్తుంది...అంతా అయ్యాకా కొన్ని రోజుల పాటు ఒక మధురానుభూతి మిమ్మల్ని వెంటాడుతుంది...ఇప్పటిదాకా చదివిన వాళ్లందరికీ ఇది అనుభవం

ఆ నవలని ఇక్కడనుంచి డౌన్‌లోడ్ చేసుకోగలరు:

https://drive.google.com/file/d/1uronf5U3_ruBiS50mg6NygkBBIi9wR7p/view?usp=sharing