Thursday, June 4, 2009

ఓంకార పంజర శుకీ

మనం పలికే ఏ శబ్దమైనా ఒక ఆకారాన్ని సంతరించుకుంటుందని మన పూర్వీకులు ఎప్పుడో చెప్ఫారు.("రామ" అనే నామాన్ని నిరంతరం జపిస్తే కళ్ళెదుట రాముడి రూపం సాక్షాత్కరిస్తుందని ఎన్నో కధల్లో చదివాము కదా...)
ఈ విషయాన్ని చాలాకాలం పాటు "సైన్సు" చదువుకున్న మేధావులు ఒప్పుకోలేదు.చివరకి మొన్నామధ్య "హాన్స్ జెన్నీ (Hans Jenny)" అనే ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త (Father of cymatics science) "టోనొ స్కోప్" అనే ఓ అద్భుతమైన పరికరాన్ని కనిపెట్టాడు.


ఏదైనా శబ్ద తరంగానికి విజువల్ రిప్రెసెంటేషన్ ని గీయడమే ఆ పరికరం చేసే పని! వివిధ ధ్వనులని చేసి, "టోనొ స్కోప్" సహాయంతో వాటి రూపాలని స్టడీ చేయడం మొదలు పెట్టాడు.ఆ ప్రయోగాల్లో భాగంగా, 'ఓంకారాన్ని ' సుస్ఫష్టంగా చదివించి, ఆ శబ్ద తరంగాల ద్వారా వచ్చే బొమ్మని గీశాడట. ఆశ్చర్యం! ఓంకారం చదివినప్పుడు వచ్చిన ఆకారం ఇదే!


ఇదేమిటో తెల్సుగా...శ్రీచక్రం!

శ్రీచక్రమంటే అమ్మవారి శరీరమని మన వేదాలు చెప్తాయి (శ్రీచక్రం శివయోర్వపుః)
అలాగే మన వేదాలూ, ఋషులూ అమ్మవారిని "ఓంకార పంజర శుకీ" అనీ, "ఓంకార రూపిణీ మాతా..." అనీ కీర్తించడం మనం విన్నాముగా...
ఇదే ఓంకారానికీ, అమ్మవారికీ (శ్రీచక్రానికీ) మధ్యనున్న సంబంధం!ఈ విషయం మన పురాణాలు ఎప్పుడో చెప్పినా, సైన్సుకి మాత్రం తెల్సుకోవడానికి ఇంతకాలం పట్టిందంతే!

కన్నుల్లో మిసమిసలు కనిపించనీ 2009



నేను రాసిన ఇంకో సరసమైన కధ...
Feb 2009 లో వచ్చిన స్వాతి మాస పత్రికలో ప్రచురింపబడింది.
http://www.scribd.com/doc/16098087/kannullo-misamisalu-kanipiMcanI

ఇల్లు మూగబోయింది 2007





ఇది ఒక సరసమైన కధ...18th Apr 2008, స్వాతి వారపత్రికలొ ప్రచురితమయ్యింది
http://www.scribd.com/doc/16098114/illu-mUgabOyiMdi

సెల్ఫ్ డబ్బా




నా పేరు నండూరి శ్రీనివాస్.పుట్టిందీ, పెరిగిందీ, MCA వరకూ చదివిందీ, అంతా భీమవరంలో.గత పదేళ్ళుగా బెంగుళూరులో పన్చేస్తున్నాను.
బొమ్మలు గీయడం, పెయింటింగ్ చేయడం, వారపత్రికలకి కధలూ నవలలూ రాయడం, గుళ్ళూ గోపురాలూ తిరగడం, సైన్సునీ ఆధ్యాత్మికతనీ సమన్వయపరచే విషయాలని తెల్సుకోవడం నా హాబీలు.
చిన్నప్పట్నుంచీ బొమ్మలు గీయడమంటే పిచ్చి.ఖాళీ ఉన్నప్పుడల్లా అడపా దడపా బాపూ గారీ, వపాగారీ బొమ్మలు చూసి గీస్తూ ఉండేవాణ్ణి.దాదాపు 2006 వరకూ వాటర్ , ఆయిల్ కలర్ పెయింటింగ్స్ చేశాను.
2007 జనవరిలో కొన్ని కారణాల వల్ల బొమ్మలు గీయడం ఆపేయాల్సొచ్చింది. .ఏమీ తోచక పిచ్చెక్కినట్టయ్యేది.అప్పుడు దృష్టి సాహిత్యం మీదకి మళ్ళింది.
అప్పట్నుంచీ కధలూ నవలలూ రాయడం మొదలు పెట్టాను.

నేను రాసినవి, నాకు తెల్సున్నవీ అప్‌లోడ్ చేయడానికే ఈ బ్లాగు.మీకు వీలున్నప్పుడు చదవండి...
nanduri.srinivas@yahoo.com

Wednesday, June 3, 2009

ప్రతిబింబాలు (నా మొదటి కధ) 2007






మా ఇంటికి దగ్గర్లో, 'పార్వతి ' అనే ఆవిడ తన ఏడేళ్ళ కూతురు 'బిందు ' తో కల్సి ఉండేది. ఆ పాపకి రెండేళ్ళ వయస్సులోనే, ఈవిడ భర్తతో తెగతెంపులు చేసుకుంది. కూతురు "నాన్న కావాలీ..." అని అడిగినప్పుడల్లా, ఓ ఖరీదైన గిఫ్టు కొనిచ్చి, పీజ్జాలు తినిపించి మేనేజ్ చేసేది. (ఆవిడ సాఫ్ట్‌వేర్ కంపెనీలో మేనేజర్ లెండి...)
కొన్నాళ్ళకి ఆవిడ, తన ఆఫీసులో పన్చేస్తున్న ఇంకో మేనేజర్‌ని, హఠాత్తుగా పెళ్ళి చేసేసుకుని బిందూని వదిలేసి, భర్తతో కల్సి బోంబే పోయింది. ఓ పది రోజుల పాటు ఇంటికి రాలేదు. (ఇలాటి తల్లులు కూడా ఉంటారా...?)
ఆ పది రోజుల్లోనూ ఆ పాప పడిన బాధ వర్ణనాతీతం. అది చూశాకా, నాకు రెండ్రోజులు నిద్ర పట్టలేదు.అప్పుడు రాసిన కధే ఈ "ప్రతిబింబాలు". నా మొట్ట మొదటి కధ.
దీనికి, "రచన-కౌముది" ఉగాది కధల పోటీల్లో (2007) రెండో బహుమతి వచ్చింది.
మరిన్ని కధలు రాయడానికి నాకు ప్రేరణనిచ్చింది.
http://www.scribd.com/doc/16098089/pratibimbaalu

చితిమంటల్లో దేవత - మహాత్ముని అంత్యక్రియల్లో అద్భుతం



తెనాలి దగ్గరున్న చందోలు గ్రామంలో శ్రీ రాఘవ నారాయణ శాస్త్రిగారనే మహాత్ములు ఉండేవారు.ఆయన్ని అందరూ "చందోలు శాస్త్రిగారు" అని పిలిచేవారు.ఆయన "బాలా త్రిపురసుందరీ" ఉపాసకులు. ఆయనకి ఇంటిలో ఏదైనా సమస్య వస్తే, అమ్మవారు చిన్న పిల్ల రూపంలో వచ్చి పరిష్కరించేదిట.
ఆయన 1991 లో తనువు చాలించినప్పుడు, దహన సంస్కారాలకి స్మాశానానికి తీసుకెళుతూ ఉండగా, ఎంతోమంది భక్తులూ , శిష్యులూ గ్రామస్తులూ కూడా స్మశానానికి వెళ్ళారుట. వారితోపాటే న్యూస్ కవరేజ్ కోసం, ఆంధ్రభూమి, ఈనాడూ మొదలైన పత్రికా విలేఖరులు కూడా వెళ్ళారు.
తీరా దహనం మొదలు పెట్టిన కొంతసేపటికి, అన్ని వేలమందీ కళ్ళారా చూస్తూ ఉండగా,చితి మంటల్లోంచి ఓ దేవతా రూపం బయటకి వచ్చి తిన్నగా ఆకాశంలోకి వెళ్ళిపోయిందిట.(ఆయన్ ఆరాధించే అమ్మవారే ఆ రూపంలో వచ్ఛారని జనాలు అనుకున్నారు)సరిగ్గా అదే సమయం లో అక్కడున్న పత్రికలవాళ్ళు ఆ దృశ్యాన్ని 'క్లిక్' మనిపించడంమన అదృష్టం.
ఆ తరువాత, 6th Oct 1991 ఆంధ్రభూమి ఆదివారం ఎడిషన్ లోనూ, ఇంకొన్ని పత్రికల్లోనూ ఆ వార్త వచ్చింది. ఆ పేపర్ కటింగుని స్కాన్ చేసి ఇక్కడ పెడుతున్నాను.






ఈ అద్భుతాన్ని కళ్ళారా చూసిన ఓ ప్రొఫెసర్ గారిని కూడా నేను తరువాత కలిశాను. వారు ఆ రోజు విలేఖరి దగ్గరనుంచి ఆ ఫొటో కి కొన్ని కాపీలు తీసుకున్నారట. అది నాకూ ఓ కాపీ ఇచ్చారు. అది మా ఇంట్లో (భీమవరం) ఇప్పటికీ ఉంది.మొన్న శలవల్లో ఇంటికి వెళ్ళినప్పుడు, ఆ ఫోటోకి మళ్ళీ ఇంకొక ఫొటో తీశాను. అది కూడా ఇక్కడ ఉంచుతున్నాను.


Nov 2017
Recently I have made a video that narrates the above incident and many more amazing incidents from the life of Sri Sastry garu.
You can find it here, in my you tube channel:
https://youtu.be/HA_XktgYaUU

Tuesday, June 2, 2009

గర్భాలయం (నా మొదటి నవల) 2008




(ప్రాచీన భారతీయ ఇతిహాసాల్నీ, ఆధునిక సైకో అనాలసిస్ సిధ్ధాంతాల్నీ సహేతుకంగా సమన్వయించే, సస్పెన్స్ థ్రిల్లర్ )


2008 ఫిబ్రవరి నెలలో ఓ రోజు, తెలుగు పౌరాణిక రాజమనదగిన ఓ సినిమా చూస్తూ ఉండగా,అయిదు సంవత్సరాల వయస్సున్న మా అమ్మాయి "శ్రీవాణి" ఒక సందేహం లేవనెత్తింది. (ఆ సినిమా పేరేమిటో, ఆ సందేహమేమిటో ఇక్కడ చెప్ప్పేస్తే , ఈ నవలలో సస్పెన్స్ తెల్సిపోతుంది . అందువల్ల చెప్పటం లేదు.)

అప్పుడు నాకు కూడా అనుమానమొచ్చి ఇంటర్నెట్ లో వెతకడం మొదలుపెట్టేసరికి, ఆ విషయం గురించి శాస్త్రీయమైన చాలా ఆధారాలు దొరికాయి.


వాటిని మన తెలుగు వాళ్ళకి ఎలాగైనా అందించాలన్న సంకల్పంతో, వాటి చుట్టూ ఓ మర్డర్ మిస్టరీ అల్లి ఓ నవల రాశాను.అంతకు పూర్వమే, నేను బొమ్మలు గీసుకునే నిమిత్తం , హంపీ చాలాసార్లు వెళ్ళాను. అక్కడా ఓ ఆర్కియాలజీ విధ్యార్ధి పరిచయమయ్యాడు. అతడి సహాయంతో, అక్కడ గైడ్‌లకి కూడా తెలియని చాలా విషయాలు తెల్సుకున్నాను. వాటిని కూడా పాఠకులకి అందించాలనే ప్రయత్నంతో , నవలని హంపీ బ్యాక్‌డ్రాప్ తో రాశాను.

ఈ నవలని "స్వాతి" పత్రికవారు 2009 జనవరిలో ప్రచురించారు.
అందరూ డౌన్ లోడ్ చేసుకోవడానికి వీలుగా ఇక్కడ పెడుతున్నాను.
http://www.scribd.com/doc/16039837/garbhalayam-by-nanduri-srinivas